ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కళాకారుల బాధలు తెలిసేలా, సుమ ఈ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ఈమె సరదాగా చేసినా అందులో ఆమె చెప్పిన విషయం మాత్రం చాలా లోతుగా ఉంది. అదేమిటంటే, ఆర్టిస్టు జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో సుమ తన మేకప్ కిట్ ను బయటకు తీశారు. తన మొహానికి మేకప్ వేసుకుంటూ.. " చాలా రోజులైంది కదా? పనిచేస్తున్నాయో లేదో అని తెలుసుకునేందుకు మేకప్ వేసుకుంటున్నానని" చెప్పుకొచ్చింది సుమా. ఇక ఈ వీడియో ని షేర్ చేయడంతో పాటు కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. ఈ వీడియోను అంత సీరియస్ గా తీసుకోకండి అంటు కోరింది సుమ. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీ ని నమ్ముకొని బతుకుతున్న ఎంతో మంది ఆర్టిస్టులు ఈ కరోనా కారణంగా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.