హీరో నాని, 'టక్ జగదీష్' సినిమా నిర్మాతలతో గొడవ పడ్డారా..? ఆ సినిమాని ఓటీటీకి ఇచ్చే విషయంలో ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చాయా..? ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. టక్ జగదీష్ సినిమా ఆల్రడీ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. కరోనా వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. అందుకే నిర్మాతలు ఓటీటీవైపు మొగ్గుచూపారని ఇటీవల వార్తలు వచ్చాయి.