ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వాళ్లు. సినీ ఇండస్ట్రీలోకి మొదట ఏఎన్నార్ అడుగుపెడితే, ఇక ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట వీరు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందే ఇద్దరు స్టేజి షో ల మీద స్త్రీ పాత్రలు వేశారు. ఇక అంతే కాకుండా ఆరు నెలల వ్యవధిలో ఇద్దరూ స్టూడియో లను కూడా నిర్మించారు.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి "గుండమ్మ కథ" సినిమాలో నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ఏంటంటే, 1950లో పల్లెటూరి పిల్ల తో ప్రారంభించి, ఆ తర్వాత సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూకైలాస్, రేచుక్క, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం, చాణక్యచంద్రగుప్త, రామకృష్ణులు, ఇక చివరిగా సత్యం- శివం చిత్రాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు.