వేట సినిమా 1986 వ సంవత్సరంలో మే 28 న అంటే, ఈ రోజున ఈ చిత్రం విడుదల అయింది అన్నమాట. నేటితో సరిగ్గా ఈ సినిమా విడుదల అయ్యి 35 ఏళ్ళు పూర్తి కావడం విశేషం. అయితే సినిమా విశేషాల్లోకి వెళితే, దర్శకుడు కోదండరామిరెడ్డి - చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "ఖైదీ" . ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్టయ్యింది. అంతేకాకుండా చిరంజీవి కెరియర్ నే మలుపు తిప్పిన సినిమా ఇదే. మళ్లీ మూడేళ్ల తర్వాత ఇదే కాంబినేషన్లో "వేట" అనే పవర్ఫుల్ టైటిల్ తో మరో సినిమా వచ్చింది. ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక కలెక్షన్స్ పరంగా బాగా రాణిస్తుంది అని అనుకుంటే, బాక్సాఫీసు దగ్గర చిరు వేట ఫలించలేకపోయింది. సినిమా చాలా కొత్తగా ఉంటుందనుకున్న బయ్యర్లకు ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. అంతేకాకుండా ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి వెక్కివెక్కి ఏడ్చారట.