దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్లిష్ట సమయంలో పేదల పాలిట దేవుడిగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. కరోనా లాక్డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది.