ఈమధ్య రేణూదేశాయ్ ఇన్ స్టా వేదికగా కరోనా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇన్ స్టా లో తనకు మెసేజ్ ఇస్తే.. వారి అవసరాలు తీరుస్తానంటూ రేణూ ముందుకొచ్చారు. అయితే ఆర్థిక సాయం చేయాలంటూ తనను ఇబ్బంది పెట్టొద్దని ఆమె మొదట్లోనే తేల్చి చెప్పారు. కానీ రేణూదేశాయ్ కి పదే పదే ఆర్థిక సమస్యలే మెసేజ్ ల రూపంలో వస్తున్నాయి. అయితే ఇదంతా ఆమెకు టార్చర్ లా అనిపిస్తోంది.