తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు ఇలా స్పందించింది.. తన చెల్లెలు అక్షర హాసన్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పింది. అంతేకాకుండా తను దర్శకత్వ రంగంలో రాణించాలనే కోరిక ఉందని తెలిపింది. తన చెల్లెలు దర్శకత్వం వహిస్తే, తనకు సరిపడా కథను అందిస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది శృతిహాసన్. ఇక కమల్ హాసన్, సారిక 1980 లో ప్రేమ వివాహం చేసుకోగా 1986 లో శృతి హాసన్ జన్మించింది. ఆ తరువాత 1991లో రెండవ కూతురు అక్షర హాసన్ జన్మించింది. ఇక 2004లో కమల్ హాసన్,తన భార్య సారిక ఇద్దరు విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.