జయం సినిమాలో మొదట ఆ పాత్ర కోసం గోపిచంద్ ను అనుకోలేదట. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మొదట బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకున్నారు. డైరెక్టర్ తేజ గారు అతనితో రెండు, మూడు రోజులు షూటింగ్ కూడా జరిపారు. కానీ డైరెక్టర్ తేజ సంగతి అందరికీ తెలిసిందే కదా! తనకు నచ్చిన కథ దొరకకపోతే అసలు సంతృప్తి చెందడు.అంతేకాకుండా ఆ బాలీవుడ్ నటుడు యాక్టింగ్ కూడా అసలు తెలియనట్టు నటించాడట . ఇక అలా నటించడంతో అతని ఆక్టింగ్ కూడా తేజ కు నచ్చలేదట దాంతో ఆ షూటింగ్ ని ఆపివేశాడు దర్శకుడు . తర్వాత బాలీవుడ్ నటుడిని సినిమా నుండి తప్పించాడు. అదే క్రమంలో మళ్లీ విలన్ కోసం గాలిస్తున్న సందర్భంలో... అతని సన్నిహితులు గోపీచంద్ గురించి తెలియజేశారు. దాంతో అతన్ని పిలిపించి.. లుక్ టెస్ట్ చేసి బాడీ లాంగ్వేజ్ చూసి మరీ ఫైనల్ చేశాడట తేజ. ఆ రోజు రాత్రి నుంచి షూటింగులు కూడా మొదలు పెట్టాడు..