దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడు, ఆది పినిశెట్టి నటుడిగా ఎంతో మంచి క్రేజ్ ను అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తను హీరోగానే కాకుండా, ఒక భయంకరమైన(సరైనోడు) విలన్ గా కూడా సత్తా చాటుకున్నాడు.2017లో మరకతమణి అని ఫాంటసీ కామెడీ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో.ఆ సినిమా హిట్ కావడంతో, ఆ సినిమాకి సంబంధించి మరో సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. స్టోరీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్టును కొన్ని రోజులు వెయిటింగ్ లిస్టులో పెట్టవలసి వచ్చింది. ఇక లాక్ డౌన్ అనంతరం వెంటనే తెలుగు ,తమిళ్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఆది పినిశెట్టి.