బాహుబలి లో మాహిష్మతి రాజ్యాన్ని నిజంగానే మన భారతదేశంలో చూడవచ్చు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో మాహిష్మతి రాజ్యపు ఆనవాళ్లు ఉన్నాయి. ఇండోర్ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్మదా నది తీరంలో కి వెళితే, పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన కట్టడాలను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే ప్రస్తుతం మహేశ్వర్ పట్టణంగా పిలుచుకుంటున్న దీనిని అప్పట్లో మాహిష్మతి అని పిలిచేవారట. అంతేకాదు మహాభారతం, రామాయణం లో కూడా ఈ మాహిష్మతి రాజ్యం ప్రస్తావన ఉంటుంది.అంతేకాకుండా మహేశ్వర్ లో ఇప్పటికీ 11 అఖండ దీపాలు నాటినుండి వెలుగుతూనే ఉన్నాయి.