2004 లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆరుగురు పతివ్రతలు సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఈ చిత్రంలో ఇద్దరు మొగుళ్ళతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి, ప్రేక్షకులను ఎంతగానో అలరించిన "అమృత" ఇప్పటికీ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది. అయితే ఈ సినిమా తరువాత అమృత మళ్లీ సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు. కన్నడ పరిశ్రమకు చెందిన అమృత, ఆరుగురు పతివ్రతలు సినిమా తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ఈమెకు కన్నడలో మాత్రం అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి.ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న అమృత, ఇక సినిమాలకు దూరంగానే ఉంటోంది. అయితే ఏది ఏమైనప్పటికీ కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను బాగా పొంది, తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన నటులలో అమృత కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.