చెన్నై లో PSB అనే స్కూల్ లో పనిచేస్తున్న ఓ టీచర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం బయటకు రావడంతో తమిళనాట విద్యార్థి సంఘాలు చాలామండి పడుతున్నాయి. అక్కడ స్టార్ హీరో సెలబ్రిటీస్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ సదరు టీచర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా ఈ విషయంపై స్పందించారు.ఇలాంటి వ్యక్తులను చాలా కఠినంగా శిక్షించాలని ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా స్కూల్ మూత పడేలా చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ను కూడా కోరారు . అలా పెట్టిన కాసేపటికే ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.నెటిజన్లు మాత్రం విశాల్ కు మద్దతుగా ట్వీట్ లు పెడుతున్నారు.