మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా సమయంలో ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాడు . తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు . అయితే ఇలాంటి సాయం చేస్తున్నప్పటికీ చిరంజీవి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్,టాలీవుడ్ నటుడు సోనుసూద్ తో పోల్చుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ కొరియోగ్రాఫర్, చిరంజీవి అభిమాని ఆట సందీప్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు చిరంజీవి ఎందుకు సాయం చేయాలి.. ఆయనను విమర్శించే వాళ్ళని గట్టిగా నిలదీశారు.దేశంలో ఏ మూల ఏం జరిగిన చిరంజీవి స్పందించాలా? దానికి గవర్నమెంట్ ఉంది. చిరంజీవి గారు చేయాలనుకుంటే చేస్తారు. ఆయన విమర్శించే వాళ్ళు పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళే. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవిని విమర్శించే వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు ఆట సందీప్.