30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కథ రాసుకున్నాక హీరో హీరోయిన్ల వేటను ప్రారంభించిన డైరెక్టర్ మున్నా.. ముందుగా స్టార్ హీరోయిన్ సమంత దగ్గరకి ఈ కథ తీసుకొని వెళ్లారు. అయితే అక్కడ సమంత మేనేజర్ వద్దకు వెళ్లి, ఆమెకు కథ చెబుతాను అంటే, పై నుంచి కింద దాకా చూస్తూ అలా ఎలా కుదురుతుంది అని ప్రశ్నించాడని, అయితే ముందుగా అతనికే చెప్పి, ఒప్పించాక, ఆ తర్వాత సమంతాను కలిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు మున్నా.ఇక సమంతతో కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది అని చెప్పింది. కాకపోతే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించనని చెప్పిందని ఆయన తెలిపారు. అయితే సమంత ను హీరోయిన్ గా అనుకున్నప్పుడు, ఇంకా హీరోగా యాంకర్ ప్రదీప్ ని ఫైనల్ చేయలేదని చెప్పారు. ఆ తరువాత ప్రదీప్ హీరోగా ఒప్పుకున్నాక, అమృత అయ్యర్ ని ఫైనల్ చేశానని.. ఇక ఆమెలోనే సమంతాను చూసుకుంటూ సినిమాని రూపొందించామని మున్నా చెప్పుకురావడం విశేషం.