పాతాళభైరవి సినిమాను మహేష్ బాబు తో హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారాట కృష్ణ . కానీ మహేష్ అందుకు ఒప్పుకోవడం లేదు అని కృష్ణ తెలిపారు. ఎందుకంటే మహేష్ బాబు కు బాలీవుడ్ కు వెళ్లాలి అన్న ఆలోచనే లేదని, ఇక్కడ తాను నెంబర్ వన్ గా ఉన్నాడని,అది చాలని మహేష్‌బాబు తెలిపినట్టు కృష్ణ తెలిపారు. అంతే కాకుండా బాలీవుడ్ లో నలుగురిలో ఒకడిగా ఉండడం కంటే, టాలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉండడమే నాకు ఇష్టమని మహేష్ బాబు చెప్పినట్లు కృష్ణ తెలిపారు. అయితే ఏది ఏమైనా ఎప్పటికైనా ఈ సినిమాను హిందీలో తప్పకుండా రీమేక్ చేస్తామని తెలిపారు కృష్ణ..