1996 వ సంవత్సరంలో వచ్చిన టార్జాన్ : ది ఎపిక్ అడ్వెంచర్ సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన జోయి లారా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఈయన ఘోర విమాన ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోవడంతో సినీ లోకం షాక్ కి గురి అయింది.ఒక సరస్సులో వారు ప్రయాణం చేస్తున్న చిన్న విమానం కూలి పోవడంతో అతనితో పాటు మరికొంత మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదంలో జోయి లారా భార్య అలాగే ప్రముఖ రచయిత, డైట్ ప్రోగ్రాం వ్యవస్థాపకులు గ్వేన్ లారా కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీరు ప్రయాణిస్తున్న సేస్నా సీ 501 అని చిన్న విమానం, స్మిర్నా టెన్ సమీపంలోని పెర్సీ ప్రీస్ట్ సరస్సులో విమానం కూలిపోయింది.