ఇటీవల పవన్ కళ్యాణ్ అకీరానందన్ కలిసి దిగిన ఒక ఫోటో ని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా హైట్ విషయంలో తండ్రిని మించిపోయాడు. ఇక రాను రాను చూస్తుంటే, సినీ ఇండస్ట్రీలో కూడా తన తండ్రి పవర్ స్టార్ ని కూడా మించి పోతాడేమో అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ని కూడా సినీ ఇండస్ట్రీలోకి తీసుకు రావాలంటూ వారు కోరుకుంటున్నారు. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.