వై.వి.యస్.చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన "ఒక్క మగాడు" సినిమా 2008 వ సంవత్సరం జనవరి 10 న విడుదల అయింది. ఈ సినిమాకు ముందు వై.వి.యస్ డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఒక్క మగాడు సినిమా ఫస్ట్ షో తోనే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని చవిచూపించింది. అయితే ఆయన సినిమా గురించి మాట్లాడుతూ ఇలా వెల్లడించారు."ఒక్క మగాడు.. సినిమా ముందు వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాల్లో నటించారని, ఆ సమయంలో హింస లేకుండా ఒక్క మగాడు సినిమాను తెరకెక్కించడం తన తప్పిధమని వై.వి.యస్.చౌదరి అన్నారు. బాలయ్య మూవీ కథ విషయంలో తన ఆలోచన తప్పు కావడంతో ఈ సినిమా ఫ్లాప్ అయిందని వై.వి.యస్.చౌదరి వెల్లడించారు".