చిరంజీవిని మెగాస్టార్ గా నిలబెట్టిన ఖైదీ చిత్రానికి మొదట కృష్ణ అని హీరోగా అనుకున్నారు. కానీ కృష్ణ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో, కృష్ణ వదిలిపెట్టిన మూవీనే చిరంజీవి చేసి, ఆ సినిమా ద్వారా మెగా స్టార్ గా ఎదిగాడు. ఇక కృష్ణ గారు రిజెక్ట్ చేసిన మరో సినిమా "కలియుగ పాండవులు" . కె.రాఘవేంద్రరావు గారు ఈ చిత్రాన్నికి దర్శకుడు. ఈ చిత్రం చేయవలసిన టైంలో కృష్ణ మరో రెండు ప్రాజెక్టులకు బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ద్వారా వెంకటేష్ హీరోగా లాంచ్ చేయమని రామానాయుడు గారి కి సలహా ఇచ్చింది కూడా కృష్ణ గారే.అలా ఈ సినిమా ను వెంకటేష్ చేశారు. ఈ సినిమా 1986 సంవత్సరం ఆగష్టు 14 న విడుదలై, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంకటేష్ హీరోగా నిలదొక్కుకున్నారు.. అటు ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలుగా ఎదిగారు.