రాజమౌళి కాకుండా మీకు తెలుగులో బాగా నచ్చే డైరెక్టర్ ఎవరంటే.. పూరీ పేరే చెబుతారాయన. అయితే పూరీ జగన్నాథ్ ను ఆయన తన శత్రువుగా చెప్పడం విశేషం. పూరీ జగన్నాథ్ లోని రైటింగ్ స్కిల్స్ కు తాను జెలసీగా ఫీలవుతానంటారు విజయేంద్ర ప్రసాద్.. సినిమాల్లో హీరోయిజం చూపించాలంటే.. ఓ చక్కటి ఘట్టం ఉండాలని.. ఓ మూమెంట్లో హీరో విరుచుకుపడితే చూడాలని జనం కోరుకుంటారని విజయేంద్రప్రసాద్ అంటారు.