ప్రియమణి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురు చూసిందట. ఇక ప్రియమణి మాట్లాడుతూ.. వెంకటేష్ గారితో నటించాలనే కోరిక నాకు చాలా కాలం నుండి ఉంది. అప్పట్లో ఆయన సరసన నటించే అవకాశాలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యేవి. ఇక ఇంత కాలానికి నా ఎదురు చూపులు ఫలించాయి. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. నారప్ప లో నేను చేసిన పాత్రకు మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకు ఉంది. " అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.