కేజీఎఫ్ సినిమాకి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. ఓ సాధారణ కన్నడ మూవీగా రిలీజై.. దాదాపుగా అన్ని భాషల్లోనూ అదరగొట్టింది కేజీఎఫ్. దానికి కొనసాగింపుగా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 పై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను అందుకునేలా కనిపిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమా నిర్మాతలు ప్లే చేసిన ఓ ప్రమోషనల్ ట్రిక్.. వారి పరువు తీసేలా ఉంది.