కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతుందన్న వార్తల నేపథ్యంలో సినిమా షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు కొత్త సినిమా సర్కారువారి పాట చిత్రీకరణ జులైలో జరుగుతుందని అంటున్నారు. అయితే సినిమా షెడ్యూల్ మొదలు పెట్టగానే.. యూనిట్ అందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారట హీరో మహేష్ బాబు. తన జాగ్రత్త తాను తీసుకోవడంతోపాటు, తన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించారాయన.