కేరాఫ్ కాన్ జ్యూరింగ్,కాన్ జ్యూరింగ్ - 2 ఇప్పటికే బాగా సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు మరోసారి మూడో చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే 2019లో " ద కాన్ జ్యూరింగ్: ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ ". సిరీస్ మొదలైంది. అప్పటి నుంచి కంటిన్యూగా పిక్చరైజేషన్ పూర్తిచేసుకున్న కాన్ జ్యూరింగ్ - 3 లాక్ డౌన్ వల్ల కాస్త ఆలస్యమైంది.ఇక ఫిలిం మేకర్స్ 2021 జూన్ 4వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. తాజాగా మరో సారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ,కాన్ జ్యూరింగ్ -3 సీరీస్ నుంచి చిన్న వీడియోను విడుదల చేశారు. అందులో జూన్ 4వ తేదీ విడుదల అంటూ ప్రకటించారు. అయితే ఒకేసారి థియేటర్లలోనూ, హెచ్ బి ఓ మాక్స్ ఓ టీ టీ లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్న సీక్వెల్ మూవీకి డోంట్ సీ ఇట్ అలోన్ అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఒంటరిగా చూడలేనంత హారర్ " ద కాన్ జ్యూరింగ్: ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ ". సినిమా అట. అయితే మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఎంత హారర్ ఉందో చూడాలి మరి.