ఇళయరాజా.. ఈయన అసలు పేరు జ్ఞానదేశికన్.. 1943 జూన్ 2న తమిళనాడులోని తేనీ జిల్లాలో పన్నైపురంలో జన్మించారు. తండ్రి రామస్వామి, తల్లి చిన్మతాయమ్మాల్. ఈ దంపతులకు ఇళయరాజా మూడవ కుమారుడిగా జన్మించారు.ఇక తెలుగులో ఎవరూ ఊహించని విధంగా ఎన్నో మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్స్ అయిన కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ ను అందించింది ఇళయరాజా మాత్రమే. ఇక 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ హయాంలో జాతీయ అవార్డును కూడా పొందారు.. ఈయనకు జాతీయ అవార్డులతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి.