మణిరత్నం 1956 జూన్ 2వ తేదీన జన్మించారు. ఈయన సినీ కుటుంబంలో జన్మించినప్పటికీ,ఈయన చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకోలేదు. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత, అతను కన్సల్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. 1983 లో కన్నడ చిత్రం పల్లవి అను పల్లవి ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. మణిరత్నం అని వృత్తిరీత్యా పిలవబడే ఈయన అసలు పేరు గోపాల రత్నం.ఇక ఈయన దర్శకత్వం వహించిన సినిమాలకు గాను ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు , ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ తో పాటు ప్రపంచంలోని వివిధ చలన చిత్రోత్సవాలలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. 2002 లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ తో సత్కరించింది.