తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు గుణశేఖర్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈయన చేసే ప్రతి సినిమాలో సెట్టింగులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈయన కెరీర్ లో ఇప్పటిదాకా 12 సినిమాలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ దర్శకుల చేత ప్రశంసలు అందుకుని టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ గుణ.