స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షో స్టార్ మ్యూజిక్. ఇక ఈ షో కు సుమ యాంకరింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రతి ఎపిసోడ్ తో కొంత మంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ, వారిని ఆటపట్టిస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది సుమ. అయితే ఇటీవలే ఈ ప్రోగ్రాం కు యాంకర్ విష్ణుప్రియ, శ్రీముఖి, రోల్ రైడా తో పాటు పలువురు పాల్గొని ఆటపాటలతో బాగా సందడి చేశారు.ఇందులో భాగంగానే ఒక రౌండులో విష్ణుప్రియ కూడా పాల్గొన్నది. అందులో ఒక గదిలో ఏ,బి, సి, డి అనే నాలుగు సూట్ కేసులు ఉంటాయి. విష్ణుప్రియ క ఏ అనే లెటర్ తో ఉన్న సూట్కేస్ తీసుకొని రాగా, సుమ వెంటనే ఏ లెటర్ ఉన్న సూట్కేస్ ను మాత్రమే ఎందుకు తీసుకున్నావ్ అని ప్రశ్నించింది. కానీ విష్ణు ప్రియ మాత్రం తెలివిగా ఏ అంటే ఎవ్రిథింగ్ అని చెప్పి తప్పించుకుంది. కానీ సుమ పట్టుబట్టడం తో అఖిల్ అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అని సుమ ప్రశ్నించగా, అందుకు విష్ణుప్రియ అవుననే సమాధానం చెప్పింది. అంతే కాదు నిజంగా అఖిల్ తో పెళ్లి చేసుకునే అవకాశం వస్తే, ఏమి ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పింది.