ఓ ఫ్లాప్ తర్వాత హీరోలు.. దర్శకులను దూరం పెట్టాలనుకుంటారా అనే విషయం గురించి గుణశేఖర్ మాట్లాడుతూ.." అందరి గురించి చెప్పలేను. నాతో చేసిన హీరోల గురించి చెప్పగలను. ఇక్కడ హిట్, ఫ్లాప్ గురించి కాదు. కొందరు సెన్సిబుల్ హీరోలు డైరెక్టర్ లోపం ఉందనుకున్నప్పుడు దగ్గరికి రానివ్వరు. కానీ ఎఫర్ట్లో లోపం లేదు.. ఫలితంలోనే ఎక్కడో తేడా కొట్టిందంటే మాత్రం మళ్లీ ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకొస్తారని చెప్పుకొచ్చాడు..