చెన్నైలోని ప్రసాద్ స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్.వి.ప్రసాద్, గతంలో స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్ ను వాడుకోమని ఇళయరాజాకు మాట ఇచ్చారు . కానీ ప్రస్తుతం ఉన్న యాజమాన్యం అందుకు ఒప్పుకోవడం లేదు. ఇక ఈ విషయమై ఇళయరాజా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక ఆయన ఇచ్చిన స్టే లో.. " ప్రస్తుతం ప్రసాద్ స్టూడియో లోకి నన్ను ప్రవేశించనివ్వడం లేదని, నన్ను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన ప్రస్తుత యాజమాన్యం రూ.50 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని".. పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని,ఇరుపక్షాలకు కోర్టు సూచించింది. ఆ తర్వాత ప్రసాద్ స్టూడియో ని ఇళయరాజా ఖాళీ చేశారు.