లవ్ స్టోరీలు చేయాలా, యాక్షన్ మూవీస్ చేయాలా.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోల్లో ఉండే సంశయమే ఇది. లవ్ స్టోరీలతో కెరీర్ బండి సాఫీగా సాగినా.. కలెక్షన్ల వర్షం కురవాలంటే, సినిమాలకు ఓపెనింగ్స్ భారీగా రావాలంటే మాస్ హీరో అనే ఇమేజ్ ఉండాల్సిందే. అందుకే కెరీర్ తొలినాళ్లలో మాస్ ఇమేజ్ కోసం హీరో రామ్ బాగా కష్టపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ లవ్ ట్రాక్ లోకి వచ్చి.. ఇంటెలిజెంట్ లవ్ స్టోరీలతో హిట్లు కొట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇస్మార్ట్ శంకర్ తో పూర్తిగా మరోసారి మాస్ స్టోరీలవైపు టర్న్ తీసుకున్నాడు రామ్.