కరోనా వల్ల దాదాపుగా చాలా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. నేరుగా థియేటర్లో వేస్తే నిర్మాతలు నాలుగు రూపాయలు కళ్లజూస్తారు. ఓటీటీలవైపు వెళ్తే బేరాలాడలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో థియేటర్లు ఎప్పుడు తీస్తారా అని నిర్మాతలు వేచి చూస్తున్నారు. అయితే హీరోల ఆలోచన మాత్రం వేరేలా ఉందట. ఓటీటీలో అయినా, ఇంకేదో రూపంలో అయినా సినిమాలు బయటకు వెళ్తే కొత్త సినిమాలతో తాము బిజీ అయిపోవచ్చనేది వారి ఆలోచన.