దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా థియేటర్లన్నీ మూసివేయబడ్డాయి. అందుకే సినీ ఇండస్ట్రీలో చాలావరకు సినిమాలన్నీ థియేట్రికల్ విడుదలకు నోచుకోకుండా, డిజిటల్ రిలీజ్ బాట పడుతున్నాయి. ఇక అందులో భాగంగానే తమిళ యువ దర్శకుడు కార్తీక్ నరేన్ తెరకెక్కించిన నరకాసురుడు సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా గత మూడు సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో మూలకు పడిపోయింది. అయితే ఏదో విధంగా గత సంవత్సరం థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్, అలాగే దర్శకుడు కార్తీక్ నరేన్ భావించారు. కానీ కరోనా కారణంగా సినిమా మరింత వాయిదా పడాల్సి వచ్చింది.థియేటర్లలో విడుదల చేయాలన్న ఆలోచనను పక్కన పెట్టి , ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా సోనీ ఎల్ ఐ వి కి అమ్ముడు పోయాయట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అంతేకాదు ప్రొడ్యూసర్ గౌతమ్‌మీనన్ కూడా తన ఆర్థిక సమస్యల తీరినట్లు సమాచారం. అందుకే ఇక ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఓ టీ టీ ప్లాట్‌ఫాం పై విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.