మహేష్ బాబు సోదరి మంజుల, అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రత ల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తపన పడుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది మహేష్ బాబు సోదరి మంజుల. నమ్రత తో దిగిన ఫోటోలు తన ట్విట్టర్లో షేర్ చేసిన మంజుల.. " నేను నమ్రతతో గడిపే సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటాను. ఆమె నా మరదలు మాత్రమే కాదు నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఈ సూపర్ ఉమెన్ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది " అంటూ నమ్రతా పై ఎంతో గొప్పగా చెప్పింది.