చిరంజీవి నటించబోతున్న లూసిఫర్ రీమేక్ చిత్రంలో, మలయాళం వెర్షన్ లో నటుడు టోవినో థామస్ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. అయితే విదేశాల నుండి ఇండియాకు తిరిగి వచ్చి, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే పాత్ర అది. అయితే ముందు ఈ సినిమాలో హీరోల కోసం కాల్ చేస్తున్న సమయంలో, ఈ పాత్ర కోసం మొదట విజయ్ దేవరకొండ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని అప్పట్లో విజయ్ కూడా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే .