కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా సలార్ చిత్రం నిర్మిస్తున్న హోంబేలే ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను రూపొందించింది. ఆ వీడియోలో ప్రశాంత్ తన టీంతో కలిసి ఎంత ఉత్సాహంగా పని చేస్తున్నాడో చూపించే వీడియో ఇది. ఈ వీడియోకి కేజిఎఫ్ హీరో యష్ చేసిన వ్యాఖ్యలు సైతం దీనికి జోడించారు. ప్రశాంత్ ప్రతిభ విషయంలో కేజిఎఫ్ ఆరంభం మాత్రమే అని.. అతడి నుంచి చాలా అద్భుతాలు చూడబోతారని హీరో యష్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది