మోహన్ బాబు హీరోగా తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇచ్చి, సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమానే "సన్ ఆఫ్ ఇండియా ". అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ప్రారంభమవడంతో ప్రేక్షకులలో మరింత ఉత్కంఠ రేపుతోంది. మెగాస్టార్ చిరు వాయిస్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో మోహన్ బాబు పలురకాల గెటప్ లు మారస్తూ కనిపిస్తారు. అంతేకాకుండా ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.