ఎస్పీ బాలసుబ్రమణ్యం తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు పాడి,40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు . ఇక ఈయనకు గాయకుడు గానే కాకుండా గాత్రదానం కళాకారుడిగా,నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. 2020 సెప్టెంబర్ 25 వ తేదీన కరోనా చికిత్స పొందుతూ చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్ లో మరణించారు.