శృతిహాసన్ "హైదరాబాద్ టైం మోస్ట్ డిజైనర్ ఉమెన్-2020" జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానంలో సమంత, పూజా హెగ్డే,రకుల్ ప్రీతి, రష్మిక వంటి హీరోయిన్లు టాప్ ఫైవ్ లో నిలిచారు. అయితే ఈమె నటించిన రీసెంట్ సినిమాలలో క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలతో శృతిహాసన్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందని చెప్పవచ్చు. ఇక ఆమెకు 2021 లో కలిసి వచ్చిందని కూడా చెప్పవచ్చు.ఇతర హీరోయిన్ల ను కాదని హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు తనకు అగ్రతాంబూలం ఇచ్చినందుకు, శృతి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. థాంక్యూ హైదరాబాద్ టైమ్స్ అంటూ ముద్దుతో పాటు కామెంట్ కూడా పెట్టింది. ఇక నెటిజన్లు ఆమె ముద్దు చూసి ఈ ముద్దు ఎవరికి అబ్బా! అంటూ కామెంట్లు చేస్తున్నారు.