రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాను నాగబాబు నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అందుకుంది. ఇక ఇందులో హీరోయిన్ జెనీలియా తో పాటు సంచిత శెట్టి కూడా నటించారు. తెలుగులో మొదటి సినిమాతోనే స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసి, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమెకు గుర్తింపు లేకుండా పోయింది. దాంతో ఈమె తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇక సంచిత సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు కన్నడ సినిమా "ముంగారు ములై " ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈమె కన్నడలో మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో తిరిగి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రామ్ చరణ్ తో నటించింది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం చేత ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకొని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని కోరుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగు లో ఛాన్స్ రాకపోయినప్పటికీ తమిళంలో బాగానే నిలదొక్కుకుంది. ఇక ఏకంగా 5 సినిమాలలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో ఫోటో షూట్ ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల అవి వైరల్ గా మారాయి