బుల్లితెరపై ఉపయోగించే కాస్ట్యూమ్స్ ని స్వయంగా వారే తెచ్చుకుంటారు. వీరికి నిర్మాతలు ఎలాంటి కాస్ట్యూమ్ లు ఇవ్వరు. పాత్రకు తగ్గట్టుగా నటీమణులే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవాలి. ఇటీవలే పలువురు ఈ కాస్ట్యూమ్స్ పై స్పందించిన విషయం కూడా తెలిసిందే . ముఖ్యంగా వీరు హైదరాబాదులోని బేగంబజార్, ఆర్కే కలెక్షన్స్ లాంటి ప్రముఖ ఏరియాలకు వెళ్లి తమకు నచ్చిన కాస్ట్యూమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ, బుల్లితెరపై ధరిస్తూ ప్రేక్షకులను కనువిందు చేస్తూ ఉంటారు. సాధారణంగా వీరు వేసే కాస్ట్యూమ్స్ కి ఎలాంటి మ్యాచింగ్ ఉండదు. కానీ వీరే స్వయంగా డిజైన్ చేయించుకొని మరీ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించవచ్చు. వీరు వేసిన డ్రస్సు వేయరు అని అందరూ అనుకుంటారు. కానీ అలా కాదు వీరు కొంచెం డ్రెస్ పాట్రన్ చేంజ్ చేసి మరీ వేసుకుంటారు.