చలన చిత్రరంగంలోకి రావాలని చాలా మంది ఉబలాటపడుతుంటారు. వారిలో చాలా మందికి అవకాశాలు దక్కవు, కొందరికి దక్కినా నిలబెట్టుకోలేక పోతుంటారు. అంతేకాకుండా సినిమా రంగంలో నిలదొక్కుకోవడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం సులువు కాదని, ఎంతో కృషి చేస్తే కాని ఇక్కడ గుర్తింపు దక్కదని ఎందరో అగ్ర నటులు అభిప్రాయ పడుతుంటారు. అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ కన్నా టాలెంట్‌కే ప్రాధాన్యం ఎక్కువ. అందులోనూ ఓ కమెడియన్‌గా రాణించాలంటే మరింత కష్టం. హీరో, విలన్, హీరోయిన్ల కన్నా కమెడియన్‌కే ఎక్కువ కష్టం ఉంటుంది. ప్రతి సన్నివేశంలోనూ తన డైలాగ్‌తో పాటు తన వాయిస్, హావభావాలు అన్నీ ఆ డైలాగ్‌కు సింక్ అయ్యి ప్రేక్షకుడిని నవ్వించేలా ఉండాలి. అందుకనే మనకు అగ్రస్థాయి కమెడియన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అటువంటి అగ్ర స్థాయి కమెడియన్‌గా పేరు పొందిన వారిలో సునీల్ కూడా ఒకడు. చూడటానికి బొద్దుగా ఉండే సునీల్ తనదైన టైమింగ్, నటన, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశాడు.