నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'లవ్ స్టోరీ సినిమాని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఆగస్టు వరకు ఒకవేళ పరిస్థితులు అన్ని చక్కబడకపోయినా కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి..