క్రియేటివ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో 1999 లో తెరకెక్కిన చిత్రం" ఒకే ఒక్కడు" ఈ చిత్రానికి ఎస్. శంకర్, ఆర్ మాధేశ్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ చిత్రంలో అర్జున్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక రఘువరన్ ప్రతినాయకుడిగా నటించారు. రాజకీయ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ చిత్రానికి కూడా వైరముత్తు రాసిన సాహిత్యానికి, ఏ ఆర్ రెహమాన్ అద్భుతంగా సంగీతాన్ని చేకూర్చారు. ఈ చిత్రం కథ పరంగా, సంగీత పరంగా ఎన్నో అవార్డులను కూడా కైవసం చేసుకుంది.