ఒకరోజు సత్యనారాయణతో కలిసి చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్ళినప్పుడు సురేఖను చూశారు.అల్లు రామలింగయ్య కుటుంబ సభ్యులందరూ చిరంజీవిని చూసి సురేఖకు సెట్ అవుతాడు అని అనుకున్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవి గురించి అన్ని చోట్ల ఆరాలు తీశారు. అంతేకాదు అప్పటికే అల్లు రామలింగయ్యతో కలిసి చిరంజీవి మూడు సినిమాలలో నటించడం చిరంజీవి కి ప్లస్ పాయింట్ అయింది. తన ప్రవర్తనను తెలుసుకున్న అల్లు రామలింగయ్య చివరికి తన కూతుర్నిచ్చి ఇంటి అల్లుడిని చేసుకున్నారు.