వైవిధ్యభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన అమరవీరుడు మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడం విశేషం . తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా చేయగా, బాలీవుడ్ అందాల తార సయీ మంజ్రేకర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు .