చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా భానుప్రియ నటించింది. అంతేకాకుండా ఇందులో ఒక పాటలో సిల్క్ స్మిత కనిపించడం మరో విశేషం. ఈ సినిమాకి రాజ్ కోటి సంగీతాన్ని అందిచగా .. గువ్వా .. గోరింకతో, అటు అమలాపురం. వంటి పాటలు అప్పట్లో ప్రభంజనం సృష్టించాయి. ఈ రెండు పాటల విశేషమేమిటంటే , ఈ రెండు పాటలను మెగా ఫ్యామిలీ లో హీరోలు రీమేక్ చేశారు.