ఆర్ఎక్స్ 100 సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే పాయల్ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత కూడా పాయల్ కు బోల్డ్ క్యారెక్టర్ లే ఎక్కువగా వచ్చాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆర్డీఎక్స్ అనే సినిమా చేసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది.