తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పోలీస్ కథలతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. వాటిల్లో నందమూరి హరికృష్ణ నటించిన 'సీతయ్య' సినిమా కూడా ఒకటి.ఎవరి మాట వినడు అనేది ట్యాగ్ లైన్. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా హరికృష్ణ కి ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది...