స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా ప్రాజెక్టు తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బన్నీ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా మాస్ లుక్ లో కనిపించనున్నారు. పెరిగిన గడ్డం, చింపిరి జుట్టుతో ఓ లారీ డ్రైవర్ పాత్రలో ఫుల్ మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు.